మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ కు తీవ్ర అస్వస్థత..!
- September 19, 2019
సినీ నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లో తన సత్తా చాటారు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్. 2009,2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు.
ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ ను వారంక్రితం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు. గత పది సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో రకాల వేషాలు వేసి రక రకాల నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా శివ ప్రసాద్ పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఇవ్వాళ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..