సీఎం జగన్‌ను కలిసిన దక్షిణ కొరియా బృందం
- September 20, 2019
తాడేపల్లి : దక్షిణ కొరియా ప్రతినిధుల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా విద్య, పరిశ్రమలు తదితర విషయాల గురించి సీఎం జగన్‌తో చర్చించారు. కాగా దక్షిణ కొరియా బృందం ఇప్పటికే మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజాను కలిసిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్య, పరిశ్రమల రంగంలో పెట్టుబడులకు అనువుగా ఉన్న పరిస్థితులను మంత్రులు దక్షిణ కొరియా బృందానికి వివరించారు. కాన్సూల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా జంగ్ డియోక్మిన్, కొరియన్ ఫార్మాసుటికల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిమ్ ఉన్‌సూక్, చూ యోంగిల్, కిమ్ జేయోల్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన దక్షిణ కొరియా బృందంలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







