ఇండియా:బ్యాంకులకు వరుసగా సెలవులు..
- September 20, 2019
ఇండియా:ఈ నెలలో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 26 , 27 న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. అలాగే 28వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినం కాగా.. 29 ఆదివారం. తిరిగి సోమవారం (సెప్టెంబర్ 30)న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. అయితే ఆ రోజూ కూడా బ్యాంకు లావాదేవీలు ఉండవు. దీంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆ తర్వాత నెల అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు ఓపెన్ అవుతుండగా.. ఆ మరోసటీ రోజు గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు మళ్ళీ సెలవు ఉండనుంది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే ఆరురోజుల సెలవులు బ్యాంకులకు ఉండనున్నాయి. ఐదురోజులు వరుస సెలవులు ఉండనుండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ నగదు కావాలనుకునే ఖాతాదారులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







