హెల్మెట్ లేదా అయితే పెట్రోల్ కూడా లేదు..
- September 23, 2019
కర్ణాటక:మీ కోసమే తంబి చెప్పేది.. వినకపోతే ఎలా.. ప్రాణాలు పోతాయ్రా నాయనా.. ఎన్ని రూల్సు, ఎన్ని చట్టాలు.. ఎన్నెన్ని ఫైన్లు.. కొత్త మోటారు వాహన చట్టం వచ్చి ఫైన్ల మోత మోగిస్తుండేసరికి ఫైన్లు కట్టలేం మహాప్రభో అంటూ చేతులెత్తేస్తున్నారు చాలా మంది. ఈ నేపథ్యంలోనే ఈ చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కర్ణాటక పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. వాహనదారులు హెల్మెట్‌ను తప్పక ధరించే విధంగా ఓ సరికొత్త రూల్‌ని తీసుకువస్తున్నారు. హెల్మెట్ లేని వాహనదారుడికి పెట్రోల్ పోయకూడదని కలబురిగి పోలీసులు పెట్రోల్ బంకుల్లో ఆంక్షలు విధించనున్నారు. పోలీస్ కమీషనర్ నాగరాజు నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 29 నుంచి ఈ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







