పునరావాసం కోసం ప్రజావాణి లో గల్ఫ్ కార్మికుల ద్దరఖాస్తు
- September 23, 2019
ఒమన్ దేశంలోని హసన్ జుమా బేకర్ అనే భవన నిర్మాణ కంపెనీ జీతం బకాయిలు ఇవ్వకుండానే తమను ఇండియాకు పంపించిందని, తమను ఆదుకోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు సోమవారం (23.09.2019) కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చిన్నబుర్ర స్వామిగౌడ్, గంగావత్ చందర్, మాచారెడ్డి మండలం ఫరీదుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ మజీద్, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డికి చెందిన పంపరి గోపాల్, క్యాసంపల్లికి చెందిన విసలావత్ రవి, దోమకొండ మండలం అంఛనూర్ కు చెందిన జోగిని మల్లయ్య ఉన్నారు.
"బయటి దేశాలకు పోయి మోసపోయి వస్తే మేమేం చేయాలి. మీరు క్షేమంగా వాపస్ వచ్చిండ్రు.. అదే సంతోషం. నా కూతురు కూడా అమెరికాకు పోయింది. అక్కడేదో మునిగి వస్తే గవర్నమెంటు ఏం చేస్తది" అని వీరి దరఖాస్తు తీసుకోవడానికి కూడా ప్రజావాణి అధికారి ఇష్టపడలేదు. కార్మికుల వెంట ఉన్న ప్రవాసి మిత్ర మజ్దూర్ యూనియన్ నాయకుడు సురేందర్ సింగ్ ఠాకూర్ జోక్యం చేసుకొని, నీ ముళ్లేమీ పోయింది సారూ.. దరఖాస్తు తీసుకొని ప్రభుత్వానికి పంపియ్యు.. అని అనడంతో వారి దరఖాస్తు స్వీకరించాడు.
తమ కంపెనీ మూతపడటంతో 600 మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇందులో 45 మంది తెలంగాణ వాసులున్నారని, కామారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురం ఉన్నామని వారు తెలిపారు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్థికంగా సహాయం చేయాలి, స్వయం ఉపాధి, పునరావాసం కల్పించాలని వారు కోరారు. మాకు ఒక సంవత్సరం జీతం బకాయిలు చెల్లించలేదు. మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి అక్కడి లేబర్ కోర్టులో జీతం బకాయిల కోసం కేసు వేశాము. మాకు ఒక్కొక్కరికి రూ.1 లక్షా 50 వేల నుండి రూ. 2 లక్షల 50 వేల వరకు జీతం బకాయిలు రావాల్సి ఉన్నదని వారు తెలిపారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చితికిపోయి ఉన్నాము. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్థికంగా సహాయం చేయాలి, స్వయం ఉపాధి, పునరావాసం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







