సింపుల్ టిప్‌తో బొజ్జకు బై బై..
- September 24, 2019
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా? బొజ్జ ఎక్కువగా ఉందా? ఎక్సర్‌సైజ్ చేసినా, డైటింగ్ చేసినా ఫలితం లేదని బాధపడుతున్నారా? ఓ సింపుల్ స్ట్రాటజీతో బరువు తగ్గడంతోపాటు ఫ్లాట్ టమ్మీని పొందొచ్చు. ఈ సింపుల్ టిప్‌తో కడుపు మాడ్చుకోకుండానే, గంటల తరబడి ఎక్సర్‌సైజ్ చేయకుండానే బరువు తగ్గించుకోవచ్చు. చేయాల్సిందల్లా తినే ప్లేట్ సైజ్ తగ్గించడమే. ఇలా చేయడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గుముఖం పడుతుంది.
పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల డయాబెటిస్, కేన్సర్ తదితర జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువనే సంగతి తెలిసిందే. క్రమక్రమంగా బరువు తగ్గడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
కాస్త తక్కువ సైజ్ ఉన్న ప్లేట్‌లో భోజనం చేయడం ద్వారా తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటాం. ప్లేట్ పరిమాణం పెరిగే కొద్దీ తీసుకునే ఆహారం కూడా పెరుగుతుంది. చిన్న ప్లేట్లలో భోజనం చేయడం ద్వారా బరువు తగ్గడంతో.. ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సిన బాధ కూడా తప్పుతుంది. 11 అంగుళాల పరిమాణం ఉన్న ప్లేట్‌తో పోలిస్తే.. 10 అంగుళాల ప్లేట్‌లో తక్కువ ఆహారం తీసుకుంటారని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.
కాబట్టి బొజ్జ పెరిగిపోయిన వాళ్లు చిన్న ప్లేట్లలో ఆహారం తీసుకుంటే బొజ్జ తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆహారం తీసుకునేటప్పుడు కడుపు నిండిన భావన కలగడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. పెద్ద ప్లేట్‌లో నిండుగా ఆహారం పెట్టుకొని తినడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ లాగించేస్తాం. చిన్నప్లేట్‌లో ఆహారం తీసుకోవడంతోపాటు.. ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. బరువు తగ్గాలని అనుకునేవారు ముఖ్యంగా జంక్ ఫుడ్‌ను పక్కనబెట్టాలి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!