జగపతిబాబు విడుదల చేసిన 'విఠల్‌వాడి' ఫస్ట్ లుక్...
- September 23, 2019
ఎన్.ఎన్. ఎక్స్‌పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 'విఠల్‌వాడి' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు జగపతిబాబు విడుదల చేశారు. నాగేందర్. టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నరేష్ రెడ్డి. జి నిర్మించారు. ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో జగపతిబాబుతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. ''విఠల్‌వాడి చిత్రం ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రోహిత్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నిర్మాత నరేష్ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను..'' అన్నారు.
నిర్మాత నరేష్ రెడ్డి. జి మాట్లాడుతూ.. ''హైదరాబాద్‌లోని విఠల్‌వాడి అనే ఏరియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా నిర్మించాము. కథ, కథనాలు ఈ సినిమాలో కొత్తగా ఉంటాయి. పాటలు, ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తాము'' అన్నారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ.. ''మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన జగపతిబాబుగారికి ధన్యవాదాలు. విఠల్‌వాడి సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం సంతోషం. నిర్మాత నరేష్ రెడ్డిగారు బాగా ఖర్చు పెట్టి సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ మూవీ మా అందరికి మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాము'' అన్నారు.
దర్శకుడు టి. నాగేందర్ మాట్లాడుతూ.. ''మా సినిమా ప్రమోషన్ జగపతిబాబుగారితో మొదలవ్వడం సంతోషం. విఠల్‌వాడి కథ నిజ జీవితంలో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథ. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో పంచుకుంటాము..'' అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







