నింగిలోకి యూఏఈ తొలి ఆస్ట్రోనాట్‌..

- September 24, 2019 , by Maagulf
నింగిలోకి యూఏఈ తొలి ఆస్ట్రోనాట్‌..

యూఏఈకి చెందిన తొలి ఆస్ట్రోనాట్‌ని నింగిలోకి తీసుకెళ్ళేందుకు సోయుజ్‌ రాకెట్‌ సిద్ధమయ్యింది. హజ్జా అల్‌ మన్సూరి, అంతరిక్షంలోకి వెళ్ళనున్న తొలి యూఏఈ ఆస్ట్రోనాట్‌ కావడం గమనార్హం. వేలాది మంది బైకనూర్‌ ప్రయోగ కేంద్రం వద్ద ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాకప్‌ క్రూ (ఎమిరేటీ ఆస్ట్రోనాట్‌ సుల్తానఠ్‌ అల్‌ నయెదితో కలిసి), వెర్టికలైజేషన్‌ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అల్‌ మన్సూరి, అల్‌ నయెది కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించాయి. రోల్‌ ఔట్‌ మరియు వర్టికలైజేషన్‌ తర్వాత రాకెట్‌ని ప్యూయల్‌తో నింపుతారు. 1961లో ఇదే ప్రాంతం నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ దూసుకెళ్ళిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com