సైక్లోన్‌ హికా: ఆరుగుర్ని రక్షించిన పిఎసిడిఎ

- September 25, 2019 , by Maagulf
సైక్లోన్‌ హికా: ఆరుగుర్ని రక్షించిన పిఎసిడిఎ

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ సిబ్బంది, అల్‌ వుస్తాలోని ఓ వాడీలో ఇరుక్కున్న బస్‌లోంచి ఆరుగుర్ని క్షేమంగా రక్షించారు. సైక్లోన్‌ హికా కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల ఒక్కసారిగా ఉప్పొంగిన నీటిలో బస్సు ఇరుక్కుపోయిందనీ, సమాచారం అందుకోగానే రెస్క్యూ టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని పిఎసిడిఎ పేర్కొంది. ఓ ప్రైవేట్‌ కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ సాయంతో బాధితుల్ని బయటకు తీసుకొచ్చారు. ఆరుగురి ఆరోగ్య పరిస్థితీ బాగానే వుందని పిఎసిడిఎ వివరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com