షార్జా: రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం: మంటల్ని ఆర్పిన ఫైర్ ఫైటర్స్
- September 25, 2019
షార్జా సివిల్ డిఫెన్స్‌కి చెందిన పైర్ ఫైటర్స్, చాకచక్యంగా ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో చెలరేగిన మంటల్ని అదుపు చేశారు. అల్ బుహైరాలోని అల్ దుర్రా టవర్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఎవరికీ ఈ ప్రమాదంలో గాయాలు కాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్, తొలుత భవనాన్ని ఖాళీ చేయించారు. ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు. షార్జా సివిల్ డిఫెన్స్ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ హని అల్ దహ్మాని మాట్లాడుతూ, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే అల్ ఎదారా, సమ్నాన్, అల్ మినా, మువైలిహ్ మరియు అల్ నహ్దా నుంచి ఫైర్ ఫైటర్స్‌ని పంపించినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







