జైపూర్-దుబాయ్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత
- September 28, 2019
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో మహ్మద్ షకిల్, మహ్మద్ రఫిక్ అనే ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వారి వద్ద ఉన్న వేర్వేరు బాక్సుల్లో భారీ మొత్తంలో అరబ్ దేశాల కరెన్సీలైన దినార్, రియాల్, దిర్హామ్స్ దొరికాయి. వాటి విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.నిందితులిద్దరిని విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కుతుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







