'అల వైకుంఠపురములో' ఫస్ట్ సాంగ్ విడుదల
- September 28, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అల వైకుంఠపురములో. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అంతేకాక బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో, ఈ సినిమా ద్వారా వారిద్దరూ హ్యాట్రిక్ విజయాలు అందుకుంటారని అంటున్నారు.
మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగె ఈ సినిమాలో బన్నీ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటి టబు, నవదీప్, నివేత పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, అక్కనేని సుశాంత్, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని సామజవరగమన అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమోని రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది.
కాగా ఆ ప్రోమోను ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో, కాసేపటి క్రితం ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ని రిలీజ్ చేసారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఆ యూత్ ఫుల్ సాంగ్ కు ఎంతో ఆకట్టుకునే విధంగా సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల గారు. ప్రస్తుతం ఆ పాట, యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.....!!
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







