ఆ మాట నుంచి పూజా హెగ్డే బయటపడుతుందా?
- September 29, 2019
నటిగా అరంగేట్రం చేసిన ఏ భాషలోనూ పూజ హెగ్డేకు పెద్దగా కలిసిరాలేదు. తమిళంలో చేసిన మాస్క్ అట్టర్ ప్లాప్ అయింది. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద ప్లాపులుగా మిగిలాయి. హిందీలో చేసిన మొహెంజదారో ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెల్సిందే. వెళ్లిన ప్రతీ భాషలో చేసిన మొదటి సినిమా ప్లాపులుగా మారడంతో ఆమెకు ఐరన్ లెగ్ ముద్ర వేసేసారు జనాలు.
అయితే తెలుగులో రీఎంట్రీ చిత్రం దువ్వాడ జగన్నాథం కూడా కమర్షియల్ గా పెద్ద ఆడేసిందేంలేదు. అయితే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. గద్దలకొండ గణేష్ చిత్రంలో చేసింది చిన్న రోల్ అయినా కోటి పారితోషికం అందుకుంది.
వెంటనే అల్లు అర్జున్, మహేష్ బాబు చిత్రాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ రెండూ హిట్ అనిపించుకున్నాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ ల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కామెడీ సిరీస్ హౌస్ ఫుల్ 4 చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే అమ్మడి రేంజ్ కి ఆకాశమే హద్దు. ఐరన్ లెగ్ అన్నవాళ్ళే గోల్డెన్ లెగ్ అంటారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..