లయన్ కబ్ సేల్: విచారణ ప్రారంభించిన అథారిటీస్
- October 01, 2019
ఓ బహ్రెయినీ వ్యక్తి 2,500 బహ్రెయినీ దినార్స్‌కి లయన్ కబ్‌ని విక్రయించడంపై విచారణ ప్రారంభించారు అధికారులు. సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువార్డ్స్ యానిమల్స్ (బిఎస్‌పిసిఎ), సంబంధిత అధికార యంత్రాంగంతో కలిసి నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో వున్నట్లు అనుమానిస్తున్నారు. బిఎస్‌పిసిఎ ప్రెసిడెంట్ మహమౌద్ ఫరాజ్ మాట్లాడుతూ, తమ సంస్థ అథారిటీస్‌కి అన్ని విధాలా సహకరిస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఛైర్మన్ డాక్టర్ మొహ్మద్ బిన్ దినాహ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ ఎఫైర్ - లైవ్ స్టాక్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అహ్మద్‌ని కూడా అల్ట్ చేసినట్లు చెప్పారాయన. నిందితుడ్ని పట్టుకునేందుకు వేగంగా విచారణ చేపడుతున్న అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!