ఒమన్‌లో అరుదైన సూర్య గ్రహణం

- October 01, 2019 , by Maagulf
ఒమన్‌లో అరుదైన సూర్య గ్రహణం

మస్కట్‌: సుల్తానేట్‌లో అరుదైన అంతరిక్ష అద్భుతం చోటు చేసుకోనుంది. 118 ఏళ్ళ క్రితం ఏర్పడిన ఆ ఖగోళ అద్భుతం, ఇప్పుడు కాకపోతే, మళ్ళీ 83 ఏళ్ళ తర్వాతగానీ చూసే అవకాశం లేదు.డిసెంబర్‌ 26న ఆ అంతరిక్ష అద్భుతం కన్పించబోతోంది. అదే సూర్య గ్రహణం. డిసెంబర్‌ 26, గురువారం సూర్య గ్రహణం ఉదయం సమయంలో కనిపిస్తుంది. ఒమన్‌ ఆస్ట్రోనామికల్‌ సొసైటీ (ఓఏఎస్‌) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చింది. ఇండియా, శ్రీలంక, సింగపూర్‌, ఇండోనేసియా మరికొద్ది దేశాల్లో కూడా ఈ సూర్య గ్రహణం కన్పించబోతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com