ల్యాండర్ విక్రమ్ పై ఇస్రో
- October 02, 2019
జులై 22 వ తేదీన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రునిపైకి చంద్రయాన్ 2 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుని వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించిన ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా విక్రమ్ జాడ కనిపించలేదు. అయితే, ఆర్బిటర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ల్యాండర్ ముక్కలు కాలేదని, ఒక్కటిగా ఉందని సమాచారం అందింది.
అయితే, విక్రమ్ తో సంబంధాల కోసం చాలా ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. నాసా సహాయం తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. చంద్రునిపై ల్యూనార్ నైట్ వాతావరణం ఉన్నది. ఈ సమయంలో అక్కడ మైనస్ 248 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ల్యాండర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇస్రో తెలియజేసింది. ల్యాండర్ పై ఆశలు వదిలేసుకోలేదని, మరో వారం రోజుల్లో అక్కడ తిరిగి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి కాబట్టి ల్యాండర్ తో సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నం చేస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







