'సైరా' రిలీజ్ సందర్భంగా విషాదం: మెగా అభిమానులకి తీవ్ర గాయాలు
- October 02, 2019
సినిమా రిలీజ్ సందర్భంగా విషాద సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభాస్ సాహో రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని థియేటర్ వద్ద ఫ్లెక్సీ కట్టే క్రమంలో విద్యుత్ షాక్ గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సైరా' విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది. పేట్ బషీరాబాద్ లో సైరా ఫ్లెక్సీ కట్టే క్రమంలో అభిమానులకి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులకి తీవ్ర గాయలయ్యాయి. మరో అభిమాని స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెఌతే.. కుత్బుల్లాపూర్ సర్కిల్, వాజ్‌పేయినగర్‌కు చెందిన కట్టా వెంకటేశ్ కుమారులు చిరంజీవి(30), రమేశ్(27)లు గార్డెనింగ్ పనులు చేస్తుంటారు. అదేవిధంగా లాజర్ కుమారుడు ప్రశాంత్(23) డిగ్రీ చదువుతున్నాడు. ఈ ముగ్గురికి సినిమాల పిచ్చి. సినిమాలు చూడటమే కాదు. సినిమా రిలీజ్ సందర్భంగా సొంత ఖర్చులతో ఫ్లెక్సీలు కడుతుంటారు. గత నెలలో విడుదలైన సాహో సినిమా సందర్భంగా ప్రశాంత్ నివాసం ముందు భారీ ఫ్లెక్సీ కట్టారు.
ఐతే, ఈరోజు సైరా విడుదల కానున్న నేపథ్యంలో సాహో ఫ్లెక్సీని తీసేసి.. సైరా ఫ్లెక్సిని కట్టాలని నిర్ణయించుకొన్నారు. సాహో ఫ్లెక్సీని తీసే క్రమంలో అది కాస్త విద్యుత్ తీగలకి తాగలడంతో షాక్ కి గురయ్యారు. ఈ ప్రమాదంలో చిరంజీవికితో పాటు రమేశ్‌కు తీవ్రగాయాలవగా ప్రశాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రస్తుతం వీరిని హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ.. ప్రాణాలు పోయేలా అభిమానం ఉండకూడదని స్టార్ హీరోలు చెబుతుంటారు. దాన్ని అభిమానులు మనసులో పెట్టుకొంటే మంచిదేమో. ముందు ఫ్యామిలీ. ఆ తర్వాతే సినిమాలు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







