అమరావతి అంబాసిడర్ గా నియమితులైన బబితా తాడే ఎవరో తెలుసా
- October 02, 2019
హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెల్చుకున్న బబితా తాడేని అమరావతి అంబాసిడర్ గా నియమించింది ఎన్నికల కమిషన్. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ SVEEP ప్రోగ్రాంకి అమరావతి అంబాసిడర్ గా బబితా తాడేవిని నియమించినట్లు ఓ అధికారి తెలిపారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్(SVEEP)ప్రోగ్రాం ద్వారా ఓటు ప్రాధాన్యత గురించి ఓటర్లకు తెలియజేస్తుంది ఎన్నికల కమిషన్. దేశంలో ఓటరు అక్షరాస్యతను కూడా ప్రమోట్ చేస్తుంది.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని అంజన్‌గావ్ సుర్జీ గ్రామ నివాసి తాడే..ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్యా భోజన కుక్‌గా పనిచేస్తుంది. గత నెలలో జరిగిన క్విజ్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి లో పాల్గొన్న తాడే 1 కోటి రూపాయలు గెల్చుకుంది. ప్రజలను చేరుకోవటానికి, ఓటింగ్ ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేయడానికి తాడే ఇప్పుడు జిల్లా రాయబారిగా ఎన్నుకోబడిందని అమరావతి జిల్లా పరిషత్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీషా ఖత్రి తెలిపారు.
తనను అంబాసిడర్ గా నియమించడం పట్ల తాడే సంతోషం వ్యక్తం చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని,ఇది మన దేశ బాధ్యత అని తాడే తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేలా తన వంతు బాధ్యతను తాను నిర్వహిస్తానని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







