విజయవాడ విమానాశ్రయం నుంచే మక్కా,మదీనాకు విమానాలు
- October 05, 2019
అమరావతి:రాష్ట్రం నుంచి మక్కా, మదీనా వెళ్లే హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే వీరు సౌదీ అరేబియాలోని పవిత్ర క్షేత్రాలకు వెళ్లి రావచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని ముస్లింలు హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి విమానాల్లో హజ్ యాత్రకు వెళుతున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కూడా ఇందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని గతంలో కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. స్థానిక విమానాశ్రయంలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేనందున ఇద సాధ్యం కాదని అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు అన్ని మౌలిక వసతులు ఏర్పాటవడంతో వచ్చే ఏడాది నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 'ఇంటర్నేషనల్ హజ్ ఎంబార్కేషన్ చెక్ పాయింట్' హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ విమానాశ్రయ ఉన్నతాధికారులకు కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ నుంచి సమాచారం అందింది. దేశంలో ఇప్పటి వరకు 21 విమానాశ్రయాలకు మాత్రమే ఈ హోదా ఉంది. తాజాగా విజయవాడ ఎయిర్‌పోర్టు ఈ జాబితాలో చేరింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







