మునక్కాయ పచ్చడితో వ్యాధులు దూరం...

- October 05, 2019 , by Maagulf
మునక్కాయ పచ్చడితో వ్యాధులు దూరం...

మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోనే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు వాటిని మనం వంటల్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు ముప్పు కూడా తప్పిపోతుంది. సాధారణంగా మునక్కాయలతో వేపుడు, సాంబారు చేసుకుంటుంటారు. అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే మునక్కాయ ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అన్ని కాలాల్లో దొరికే ఈ మునగాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే మనం తరచూ ఎదుర్కొనే చిన్న చిన్న వ్యాధులను కాపాడుతుంది. ఇందులో విటమిన్-ఎ అధికంగా ఉండడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. బరువు, లావు తగ్గాలనుకునే వారికి మునగాకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్-సి ఎముకలను బాగా బరపరుస్తుంది. విటమిన్ ఎ-సినే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను పచ్చడి లేదా కూరచేసుకుని తింటే జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే మధుమేహం..రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అయితే ఇన్ని ఔషధ గుణాలున్న మునగాకు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం..ఒక పాన్ లో కొంచెం నూనె పోసి వేడిగా అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేయించి తీసి ఒక బౌల్‌లో పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకుకు అదే పాన్ లో కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కనే పెట్టుకోవాలి.

మిక్సీ జారులో ముందు వేయించిన దినుసలన్నీ వేసి మిక్సీ పట్టి ఆ తరువాత మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాళింపు పెట్టి రుబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి దించేయాలి. ఇలా చేసిన పచ్చడిని తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com