ఏ.పి సి.యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
- October 05, 2019
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన... సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని ఈ భేటీలో ప్రధానిని కోరే అవకాశం ఉంది. అదే విధంగా పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్ వివరిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో భేటీలో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







