నేడు ట్యాంక్‌బండ్‌పై మహా బతుకమ్మ పాల్గొననున్న వేలాది మంది మహిళలు
- October 05, 2019
హైదరాబాద్:సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం నాడు భారీ సంఖ్యలో మహిళలచే బతుకమ్మ పండుగ నిర్వహణకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎల్బీస్టేడియం నుండి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే బతుకమ్మ శోభయాత్ర జరిగే రహదారితో పాటు బతుకమ్మలను నిమజ్జనంచేసే బతుకమ్మఘాట్‌లో ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. బతుకమ్మలచే ర్యాలీ జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రతను జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో 6వేల మంది మహిళలు జీహెచ్ఎంసీ ద్వారా హాజరుకానున్నారు. ప్రతి జోన్ నుండి వెయ్యి మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరయ్యేలా 120 వాహనాలను జిహెచ్ఎంసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం నుండి ఎల్బీస్టేడియానికి మహిళలు చేరుకొని బతుకమ్మలను పేరుస్తారు. మధ్యాహ్నాబోజనం అనంతరం ఎల్బీస్టేడియం నుండి మధ్యాహ్నం 3గంటలకు మహిళలకు బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వచ్చి బతుకమ్మ ఆడుతారు. ఈ కార్యక్రమ నిర్వహణకు పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు జీహెచ్ఎంసీ పలు ఏర్పాట్లు చేపట్టింది.
బతుకమ్మ ఘాట్ సిద్దం
బతుకమ్మ పండుగకు ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న బతుకమ్మ ఘాట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సిద్దం చేశారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో బతుకమ్మ ఆడే మహిళలు బతుకమ్మలను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయడానికి బతుకమ్మ ఘాట్‌ను జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నిర్మించింది. ఈ ఘాట్ చుట్టూ ప్రత్యేకంగా మంచినీరు ఉండేలా నిర్మాణాన్ని చేపట్టింది. ఆదివారం జరిగే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మఘాట్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించడం, పరిసర ప్రాంతాలలో వ్యర్థాలు, పిచ్చి చెట్లను తొలగించి పరిశుభ్రపరిచే ప్రక్రియను జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో చేపట్టింది.
_1570281470.jpg)
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







