కువైట్ లో 150వ మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు...

- October 05, 2019 , by Maagulf
కువైట్ లో 150వ మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు...

కువైట్:మహాత్మా గాంధి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కువైట్ నందు రాజధాని ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగోతు మాట్లాడుతూ మహాత్మా గాంధి ప్రపంచానికి అహింస అనే తారక మంత్రాన్ని అందించారని గాంధీజీ స్వాతంత్ర సమరంలో స్వదేశంలో నే కాకుండా ఆనాడు ప్రవాస భారతీయులను కదన రంగంలో కి ఆకర్శించారు.

గాంధీజీ కోరుకున్న స్వచ్ఛ భారత్ నేడు భారత్ లో యజ్ఞం లాగా కొనసాగుతున్నది అని, మనము కూడా ఎక్కడా, ఏదేశం లో ఉన్నా మనం అందరం ఆదేశ పద్ధతులు, చట్టాలు గౌరవిస్తూనే  భారతదేశం ఉన్నతి.ప్రపంచంలో గౌరవం పెరిగేలా ప్రవర్తించాలి అన్నారు.
మోదీ భారత దేశాన్ని 5 ట్రిలియన్ ల ఆర్థిక అభివృద్ధి కొరకు కంకణం కట్టుకున్నారు, దానిలో ప్రవాసాంధ్రులు పాత్ర పెద్దఎత్తున ఉండాలి అని ఆకాంక్ష..ప్రతిఏటా 5600 కోట్లు ఒక్క కువైట్ నుండి భారతదేశం కు విదేశీ మారక నిల్వలు వస్తున్నాయి అని ,భవిష్యత్ లో గల్ఫ్ దేశాలకు4వ తరగతి ఉద్యోగులు గా కాకుండా వ్యాపార యజమానులు గా ఎదగాలని కోరుకొన్నాము.

కార్యక్రమానికి ముందు భారత రాయబారి జీవన్ రావు ను కలిసి ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలు మీద చర్చించడమైనది.ముఖ్యంగా తిరుపతి కి నేరుగా గల్ఫ్ దేశాలకు విమాన ము నడపాలని ప్రవాసాంధ్రులు కోరికను కేంద్రం దృష్టికి తీసుకొని పోతానని హామీ ఇచ్చారు.నిర్వహికులు పెద్దయెత్తున ఘనస్వాగతం పలికి సన్మానించారు.ఈ కార్యక్రమం నకు అధ్యక్షత బలరాం నాయుడు వహించగా, నిర్వాహకులు రవి ములకల, కనక దుర్గ ప్రసాద్, దివాకర్ ఓలేటి, రెడ్డి ప్రసాద్,పొత్తూరి  మురళీధర్ రెడ్డి, నెట్టెం కృష్ణ, హరి ,గొంది అమర్నాథ్,రవీంద్ర రెడ్డి, మహబూబ్ తదితరులు కార్యక్రమం ను పర్యవేక్షించారు మరియు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com