10వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టనున్న HSBC
- October 07, 2019
బెంగళూరు: ప్రముఖ బ్యాంకు హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ తమ ఉద్యోగుల తొలగింపుపై దృష్టి సారించింది. బ్యాంకింగ్ గ్రూపునకు సంబంధించి పెద్ద జీతాలు పొందుతున్న వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థికమాంద్యమే అని హెచ్‌ఎస్‌బీసీ చెప్పుకొచ్చింది. హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ నోయల్ క్విన్ ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగులను తొలగించాలని భావించినట్లు ఓ జాతీయ పత్రిక కథనం వెల్లడించింది. ఇదే అంశంపై అవగాహన ఉన్న ఇద్దరు హెచ్‌ఎస్‌బీసీ అధికారులు తెలిపినట్లు ఆ పత్రిక తమ కథనంలో ప్రచురించింది.
ఇక హెచ్‌ఎస్‌బీసీ ఉద్యోగుల తొలగింపు ప్రకటన మూడవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగష్టులో మధ్యంతర సీఈఓగా క్విన్ నియమితులయ్యారు. అంతకుముందు సీఈఓగా పనిచేసిన జాన్ ఫ్లింట్ అకస్మిక రాజీనామాతో పై స్థాయి మేనేజ్‌మెంట్‌ను మార్చాలని ఆ సంస్థ భావించింది. అయితే సవాళ్లతో కూడిన వాతావరణంలో పనిచేసే వారికోసం హెచ్‌ఎస్‌బీసీ వేటకొనసాగించింది. ఈ క్రమంలోనే క్విన్‌ను తాత్కాలిక సీఈఓగా హెచ్‌ఎస్‌బీసీ సంస్థ ప్రకటించింది.
హెచ్‌ఎస్‌బీసీ ఛైర్మెన్ మార్క్ టక్కర్‌తో విబేధాల కారణంగానే ఫ్లింట్ రాజీనామా చేసినట్లు సమాచారం. కంపెనీకి సంబంధించి కొన్ని లావాదేవీలపై ఇరువురి మధ్య విబేధాలు తలెత్తినట్లు హెచ్‌ఎస్‌బీసీలో పనిచేసే మరో ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది మొదట్లో 4వేల మంది ఉద్యోగస్తులను తొలగిస్తామని హెచ్‌ఎస్‌బీసీ ప్రకటన చేశాక మరో 10వేల ఉద్యోగులను తొలగిస్తామన్న తాజా ప్రకటన ఎంప్లాయిస్‌లో కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తుండటంతో ఆ ప్రభావం హెచ్‌ఎస్‌బీసీ పై భారీగా పడింది. దీనికి తోడు మోనిటరీ పాలసీల్లో సరళీకృతం కావడం, ఈ బ్యాంకుకు ప్రధాన మార్కెట్‌గా ఉన్న హాంకాంగ్‌లో అనిశ్చితి నెలకొనడం, బ్రెగ్జిట్ లాంటి అంశాలతో బ్యాంకు నష్టాల బాటన పడుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







