అజార్ కుమారుడితో సానియా మీర్జా చెల్లి పెళ్లి...డిసెంబర్లో అసద్-ఆనంల వివాహం: సానియా
- October 07, 2019
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ వివాహం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లి ఆనంతో జరుగనుంది. గత కొంతకాలంగా వీరి వివాహంపై వస్తున్న వార్తలను నిజంచేస్తూ వారి పెళ్లిని సానియా ధృవీకరించారు. వీరిద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్లో జరుగుతుందని ఆమె తెలిపారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సానియా ఈ అసద్-ఆనంల పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు.
కాగా మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అక్బర్ రషీద్‌ను నిఖా చేసుకున్న ఆనం.. అనంతరం వారి బంధానికి గుడ్‌బై చెప్పారు. ఇటీవల అతని నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. అయితే అతనితో దూరంగా ఉంటున్న సమయంలోనే అసద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారిద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చించి డిసెంబర్లో వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!