కరివేపాకుతో ఉపయోగాలు
- October 08, 2019
కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, మెగ్నిషియం, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి అనేక పోషకాలున్నాయి. ఇటువంటి కరివేపాకులో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.
కరివేపాకు అజీర్ణాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. జీర్ణాశయ సమస్యలను నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ప్రేగులు, పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ సమస్యల నుండి కాపాడుతుంది. కరివేపాకును ప్రతిరోజూ తీసుకుంటే చెమట ఎక్కువగా పట్టదు.
న్యూమోనియా, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యల నుండి కాపాడేందుకు కరివేపాకు దివ్యౌషధంగా సహాయపడుతుంది. మధుమేహం, రక్తపోటు రుగ్మతలను తగ్గించుటలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ ప్రేరేపిత కారకాలను నియంత్రిస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. కరివేపాకులో గల కార్బోజోల్ ఆల్కలాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







