రాజుగారి గది 3 ఫస్ట్ లుక్ & విడుదల తేదీ
- October 08, 2019
యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్..రాజు గారి గది చిత్రంతో డైరెక్టర్ గా సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. హర్రర్ కు కామెడీ మిక్స్ చేసి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దీనికి సీక్వెల్ తీసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా దీనికి మూడో పార్ట్ గా రాజు గారి గది 3 తెరకెక్కిస్తున్నారు.
మొదట రెండు చిత్రాలలో పూర్ణ, సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ అక్టోబర్ 18 న రిలీజ్ చేస్తున్నట్లు దసరా లుక్ తో తెలిపారు. దసరా పోస్టర్ లో చుట్టుముట్టిన దెయ్యాల మధ్యలో అశ్విన్ ఎంతో ధీమాగా ధైర్యంగా కనిపిస్తున్నాడు. మెరూన్ కలర్ సిల్కు చొక్కాయ్.. తెల్ల జెరీ పంచెలో ఆ కాలం రొమాంటిక్ పిల్ల జమీందార్ ని తలపిస్తున్నాడు. దెయ్యాల మధ్యలో ఉన్నా రొమాంటిక్ యాంగిల్ మాత్రం ఆ కళ్లలో హైలైట్ గా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







