మైసూర్ దసరా వైభవం

- October 08, 2019 , by Maagulf
మైసూర్ దసరా వైభవం

మైసూర్:400 ఏళ్ల చరిత్ర ఉంది దసరా పండగకు దశ హరా అనే పదం నుంచే దసరా వచ్చింది. ఈ దసరా పండగను ముఖ్యంగా కర్నాటకలోని మైసూరులో ఘనంగా జరుపుకుంటారు. మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. అప్పట్లో ఈ సంబరాలను ప్రారంభించిన వడియార్‌ రాజ వంశీకులు ఇప్పటికి కూడా పూజల్లో పాల్గొనడం విశేషం. దసరారోజు బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం కన్నుల పండుగగా ఉంటుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూర్‌ మహారాజా ప్యాలెస్‌ను దసరా పండగకు లక్ష విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు.

చేపలు... కేకులులో షోడశోపచార పేరుతో ఒడిషాలో 16 రోజులపాటు ఈ దసరా వేడుకలు జరుపుకుంటారు.ఇక ఆఖరి రోజు ఐతే అమ్మవారికి పెరుగన్నం, కేకులతో పాటు చేపల వేపుడును నైవేదంగా సమర్పిస్తున్నారు. చర్చిల్లోనూ కూడా పుస్తకాలకు పూజ చేయడమనే అలవాటును కేరళలోని కొందరు క్రైస్తవులు కూడా పాటించడం కూడా జరుగుతుంది ఈ విజయదశమి రోజు. కొన్ని చర్చిల్లో పిల్లలకు దసరా రోజు అక్షరాభ్యాసం కూడా చేపిస్తారూ. గుజరాత్‌లో వూరూరా గార్బా, దాండియా రాస్‌ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటారు.

ఇక మహారాష్ట్రలో మాత్రం సీమోల్లంఘనం పేరుతో తమ వూరి పొలిమేరలు దాటి వస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. మనం దసరాకి ముందు నవరాత్రులు జరిపితే హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూలో మాత్రం దసరా తర్వాత ఏడు రోజులపాటు వేడుకలు జరుపుకుంటారంటా. విజయదశమినాడు రామలక్ష్మణసీతా విగ్రహాలతో రథయాత్ర జరుపుతారు అక్కడ. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి రథయాత్రను లాగడంతో పాటు చూసి ఆనందిస్తారు. మన దేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, మారిషస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com