కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్ గంభీర్
- October 09, 2019
మాములుగా పెళ్లి సమయంలో తండ్రి తన కూతరు కాళ్ళు కడుగుతాడు.. అయితే టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాత్రం తన చిన్నారి కూతుళ్ళ కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశాడనే డౌట్ రావొచ్చు.. ఇదంతా శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్ ఆచారంలో భాగం. ఈ ఆచారం ప్రకారం పెళ్ళైనా.. కాకపోయినా.. దసరా సమయంలో తండ్రి తన కూతుళ్ళ కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిమీద జల్లుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. గౌతమ్ గంభీర్ కూడా తన ఇద్దరు కూతుళ్ల కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రసుత్తం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ చేస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







