అనైతిక చర్యలు: 27 మంది ఆసియా నిర్వాసితులను అరెస్టు
- October 09, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్‌ఓపి) కమాండ్, 27 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇందులో అత్యధికులు మహిళలే. పబ్లిక్ మొరాలిటీని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారంటూ వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. 'మస్కట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 21 మంది మహిళల్ని, 6 మంది పురుషుల్నీ అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా ఆసియా జాతీయులు. పబ్లిక్ మొరాలిటీస్‌ని దెబ్బతీయడమే కాకుండా లేబర్ మరియు రెసిడెన్సీ ఉల్లంఘనలకు కూడా వీరు పాల్పడ్డారు..' అంటూ రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. రెంటెడ్ అపార్ట్‌మెంట్ల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







