మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న జగ్గూభాయ్
- October 12, 2019
నాటకాలు, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ ఇలా ఇప్పుడు వెబ్ సిరీస్లు. ఇలా ఒక్కోకాలంలో ఒక్కో ట్రెండ్. ప్రస్తుతం వెబ్ సిరీస్ హవా నడుస్తోంది ప్రపంచమంతా. ఇక పూర్తి విషయానికి వస్తే 'ఆమె' సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా షాక్‌కు గురిచేసింది అందాల భామ అమలా పాల్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకొనప్పటికీ సౌత్ సినీ ఇండస్ట్రీ నుండే కాకుండా ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాతలు అమల పాల్‌పై ప్రశంసల జల్లులు భారీగా కురిపించారు.
అయితే 'ఆమె' సినిమాలో అమలా పాల్ బోల్డ్, బ్యూటిఫుల్‌గా ఉన్నారని ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మెచ్చుకున్నవిషయం అందరికి తెలిసిన విషయమే. అది అలా ఉంటే హిందీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' సిరీస్ ను తెలుగులో రీమేక్ చేయాలని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో 'ఆమె'తో అందర్ని ఆకర్షించిన అమలా పాల్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం అందుతోంది.
కియారా అద్వానీ, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఎరోటిక్ 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌కు హిందీలో విపరీతమైన ప్రేక్షాధారణ లభించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కియారా అద్వానీ లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను తెలుగులో తీయాలని నిర్మాత రోని స్క్రూవాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్‌లు ఈ సిరీస్‌లోని నాలుగు కథలను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విష్యం ఏమిటంటే ఇందులో జగపతిబాబు కూడా ఓక ముఖ్య పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







