'సైరా' ఇచ్చిన జోష్ తో 152వ మూవీ షురూ చేసిన మెగాస్టార్
- October 13, 2019

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కలయికలో తెరకెక్కబోయే చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు దసరా రోజు గ్రాండ్ గా పూర్తి అయ్యాయి. వచ్చే నెల నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసారు. ఇక ఈ మూవీ లో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ ను ఎంపిక చేసారని సమాచారం.
అలాగే తమిళ యంగ్ హీరో ఆర్య ఒక కీలకమైన రోల్ లో యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కథని మలుపు తిప్పే కీలక రోల్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించబోతున్నారట. వీటిపై అతి త్వరలో చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అతుల్-అజయ్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







