మజ్జిగ తో అట్టు ట్రై చేసారా!

మజ్జిగ తో అట్టు ట్రై చేసారా!

మజ్జిగను మనం అన్నంలో వేసుకొని తింటారు. లేదా తాగుతారు. ఒట్టి మజ్జిగను మాత్రమే తాగకుండా అందులో కొచం రుచిని పెంచడానికి మసాలా వేసి చేసుకొని తాగుతారు. ఇకపోతే ఈ మజ్జిగతో వెరైటీగా స్నాక్స్ కూడ చేసుకోవచ్చును. అలాంటిది ఈ మజ్జిగను ఉపయోగించి అట్టు వేసుకోవచ్చును అంటున్నారు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
బియ్యపు పిండి : అరకప్పు
మైదా పిండి : అరకప్పు
పెరుగు : మూడు స్పూన్లు
పచ్చిమిర్చి : ఐదు
ఉల్లిపాయ :ఒకటి
వాటర్ : 2కప్స్
జీలకర్ర : కొద్దిగా
ఉప్పు : సరిపడా

తయారీ విధానం :
బియ్యపు పిండి, మైదా పిండి సమంగా తీసుకొని, పెరుగులో కొన్ని నీళ్లు వేసి మజ్జిగగా తయారు చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర ను నూరి పక్కన పెట్టాలి. ఈ మజిగ్గలో, ఆ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పిండి మిశ్రమంలో వేసి దోస పిండిలాగా కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని కొద్దీ సేపు నానపెట్టాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసి అట్టులాగా వేసుకొని రెండు వైపులాగా దోరగా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన మజ్జిగ అట్టు రెడీ.. 

Back to Top