సెయింట్‌గా మరియం థ్రెసియా: ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్
- October 14, 2019

వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ భారత్ లోని కేరళకు చెందిన నన్ మరియం థ్రెసియాను సెయింట్‌గా ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ హాజరయ్యారు. థ్రెసియా 1914 మే లో త్రిస్సూర్‌లో పవిత్ర కుటుంబ సోదరీమణుల సమాజాన్ని స్థాపించారు. రోమ్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో యూకా రిస్టిక్ వేడుకలో థ్రెసియాను కీర్తించారు.
ఇంగ్లీష్ కార్డినల్ జాన్ హెన్రీ న్యూమాన్, స్విస్ లేవుమన్ మార్గూరేట్ బేస్, బ్రెజిలియన్ సిస్టర్ డుల్స్‌లోప్ మరియు ఇటాలియన్ సిస్టర్ గియుసెప్పినా వన్నినీలతోపాటు మరియం థ్రెసియాను మహాత్ముల జాబితాలో చేర్చనున్నారు. శతాబ్దాల కాలంలో కేరళ నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగిన నాల్గవ వ్యక్తిగా ఆమెను పరిగణించనున్నారు.
మదర్ మరియం థ్రెసియా కాననైజేషన్ వేడుకలను ఆదివారం త్రివేండ్రంలోని సెయింట్ జోసఫ్ కెథడ్రిల్ చర్చిలో నిర్వహించారు. బాప్టిజం తీసుకున్న మే 3 1876 నుంచి 1904వరకు మరియం థ్రెసియా సగం జీవితకాలం వరకూ ఆమెను థెరిసాగానే పిలిచేవారు. అనంతరం ఆమె మేరీ మాత ఆశీస్సులతో తన పేరు ముందు మరియం చేర్చవలసిందిగా కోరారు. ఏసును అనుకరిస్తూ ఆమె పేదలకు సహాయంచేసిందని, రోగులకు వైద్యం, పారిస్‌ను సందర్శించి ఒంటరి ప్రజలను ఆమె ఓదార్చిందని వాటికన్ న్యూస్ తెలిపింది. చర్చి ఆమెను అరుదైన పవిత్ర వ్యక్తులుగా ప్రకటించింది.
జోస్యం, వైద్యం, కాంతి ప్రకాశం, సువాసన వంటి ఆధ్యాత్మిక బహుమతులు ఆమెకు లభించాయని వాటికన్ తెలిపింది. సిస్టర్ థ్రెసియా జూన్ 8, 1926న 50సంవత్సరాల వయసులో మరణించారు. పోప్ సెయింట్ జాన్‌పాల్ -2 ఏప్రిల్ 9, 2000న ఆమెను ఆశీర్వదించారు. పోప్ ఫ్రాన్సిస్ ఆమె మధ్యవర్తిత్వం ద్వారా జరిగిన అద్భుతాన్ని గుర్తించడంతో సెయింట్‌హుడ్‌కు మార్గం సుగమమైంది. అక్టోబర్ 13న కాననైజేషన్ రోజుగా నిర్ణయించారు. వాటి కన్ సిటీలో జరిగిన కార్యక్రమానికి భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ నాయకత్వం వహించారు.
కాగా సెప్టెంబర్ 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మరియం థ్రెసియా గురించి ప్రస్తావించారు. అక్టోబర్ 13న పోప్ ఫ్రాన్సిస్ ఆమె సెయింట్‌గా ప్రకటించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. కాగా, మదర్ థెరిస్సా తర్వాత భారత్ నుంచి సెయింట్ హోదా పొందిన రెండవ భారతీయురాలిగా ఆమె గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







