మందిరమా-మసీదా : ఫైనల్ తీర్పుకి సుప్రీం రెడీ..అయోధ్యలో ఉత్కంఠ..144 సెక్షన్

మందిరమా-మసీదా : ఫైనల్ తీర్పుకి సుప్రీం రెడీ..అయోధ్యలో ఉత్కంఠ..144 సెక్షన్

వివాదస్పద అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసులో సుప్రీంలో వాదనలు తది దశకు చేరుకున్నాయి. దసరా బ్రేక్ తర్వాత సుప్రీంలో సోమవారం అయోధ్య విచారణ జరుగుతోంది. ఇవాళ(అక్టోబర్-14,2019)ముస్లిం పార్టీల వాదనలు ముగియనున్నట్లు ఐదుగరు సభ్యుల ధర్మాసనం తెలిపింది. మంగళవారం,బుధవారం హిందూ పార్టీలు సుప్రీంలో తమ వాదనలు వినిపిస్తారు. అక్టోబర్ 17న అయోధ్య కేసులో అన్ని పార్టీల వాదనలు ముగుస్తాయి. సున్నితమైన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును నవంబరు 17,2019న వెల్లడించనుంది.

అయితే శాంతి భద్రతల దృష్యా ఇప్పటినుంచే అయోధ్య నగరంలో 144 సెక్షన్ ను విధించారు. అయోధ్యపై సుప్రీం తీర్పుతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న సందర్భంగా డిసెంబరు 10,2019వరకు అయోధ్యలో 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు విధిస్తున్నట్లు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా పౌరుల భద్రత కోసం 144 సెక్షన్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీపావళి పండగ సందర్భంగా కూడా బాణసంచాను విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు.

అయోధ్య వివాదం పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీవివాదానికి స్నేహపూర్వక పరిష్కారం కనుగొనడంలో విఫలమైన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే.

Back to Top