'జెర్సీ' రీమేక్‌కు సిద్ధమైన ‘కబీర్‌సింగ్’!
- October 14, 2019
టాలీవుడ్ సెన్సేషన్ ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌తో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మరో సౌత్ రీమేక్‌కు సిద్ధమయ్యాడు. నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ మూవీ హిందీ వర్షన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత ఈ ప్రాజెక్టును బీ-టౌన్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రీమేక్ చేస్తాడని అంతా భావించారు.
అయితే అమన్ గిల్‌తో కలిసి టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా హిందీ రీమేక్‌ను నిర్మించనున్నట్లు తాజా సమాచారం. అంతేకాదు జెర్సీ ఒరిజినల్ వర్షన్‌ను రూపొందించిన గౌతం దర్శకత్వంలోనే హిందీ సినిమా కూడా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో హిందీ జెర్సీని విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ‘కబీర్‌సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన షాహిద్ కపూర్ ఈ సినిమా కోసం దాదాపు రూ. 40 కోట్ల మేర రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రను రష్మిక మండన్న పోషించనున్నారన్న వార్తలు వెలువడినా.. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







