లండన్ లో 'ఘంటసాల ది గ్రేట్' ట్రైలర్ విడుదల
- October 14, 2019
లండన్:ఘంటసాల.. తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని పేరిది. తన గాన మాధుర్యాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు పంచిన మహోన్నత గాయకుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.సి.హెచ్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.భాస్కర్ సహ నిర్మాత. లయన్ డాక్టర్ కలపటపు లక్ష్మీ ప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులు. బర్మింగ్‌హామ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసారు. ప్రముఖ సింగర్ చిత్ర చేతులు మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. కాగా, ఈ సినిమా పోస్టర్‌ని ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ విడుదల చేసారు. రాగస్వర, యుకె ఈ ప్రోగ్రామ్‌ని సపోర్ట్ చేస్తున్నారు. మా గల్ఫ్ ఈ చిత్రానికి గల్ఫ్ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. లక్ష్మీ నీరజ ఈ చిత్రానికి నిర్మాత.


తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







