ఏ.పి ముఖ్యమంత్రిని కలిసిన అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌

- October 16, 2019 , by Maagulf
ఏ.పి ముఖ్యమంత్రిని కలిసిన అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌

అమరావతి:  హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీఎంని తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్‌  వైయస్‌.జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతోపాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించీ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషిచేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనాసంస్కరణలపై రిఫ్‌మాన్‌ ప్రశంసలు కురిపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com