సౌదీలో ఘోర రోడ్డుప్రమాదం...35 మంది మృతి, నలుగురికి గాయాలు
- October 17, 2019
సౌదీ: యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినరు ఢీకొన్న ఘటనలో 35 మంది మరణించగా, నలుగురు గాయపడిన ఘటన సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ కేంద్రం వద్ద బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు చెప్పారు. గాయపడిన నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరైనా భారతదేశ వాసులెవరైనా ఉన్నారా అనే విషయంపై భారత రాయబార కార్యాలయం అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







