కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ: 'రంగమార్తాండ'
- October 17, 2019
కృష్ణవంశీ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనీ, ఆ సినిమా కోసం ఆయన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే కృష్ణవంశీ ఏ సినిమా చేస్తున్నాడు? అది ఎప్పుడు మొదలుకానుంది? అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. 2016లో వచ్చిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'కి రీమేక్ గా కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'రంగమార్తాండ' అనే టైటిల్ ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్ ను వదిలాడు. మరాఠీలో నానాపటేకర్ చేసిన పాత్రలో ప్రకాశ్ రాజ్ .. ఆయన సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. అభిషేక్ - మధు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'శ్రీఆంజనేయం' తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







