ఖతార్‌లో ప్రారంభమైన లోకల్‌ డేట్స్‌ ఎగ్జిబిషన్‌

- October 18, 2019 , by Maagulf
ఖతార్‌లో ప్రారంభమైన లోకల్‌ డేట్స్‌ ఎగ్జిబిషన్‌

దోహా:ఈ ఏడాది ఇప్పటికే ఓ సారి లోకల్‌ డేట్స్‌ ఫెస్టివల్‌ జరగ్గా, మరోసారి ఆ ఫెస్టివల్‌ ప్రారంభమయ్యింది. సౌక్‌ వకిఫ్‌తో కలిసి మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఈ ఫెస్టివల్‌ని ఏర్పాటు చేసింది. సౌక్‌ వకిఫ్‌లో ఈ లోకల్‌ డేట్స్‌ఎగ్జిబిషన్‌ ప్రారంభమయ్యింది. 56 స్థానిక ఫామ్స్‌ నుంచి సేకరించిన డేట్స్‌ని ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకం కోసం వుంచారు. ఫామ్‌ ఓనర్స్‌ తమ ఉత్పత్తుల్ని డైరెక్ట్‌గా పబ్లిక్‌కి విక్రయించేందుకోసం ఈ ఫెస్టివల్‌ ఎంతగానో ఉపకరిస్తుంది. కాగా, ఖతార్‌ డేట్స్‌ ఉత్పత్తిలో 87 శాతం సెల్ఫ్‌ సఫీసియన్సీని సాధించినట్లు మినిస్టర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ మునిసిపాలిటీ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ రుమైహి ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశంలో 916 డేట్‌ ఫామ్స్‌ వున్నాయి. ప్రతి యేడాదీ 30,000 టన్నుల డేట్స్‌ని ఈ ఫామ్స్‌ ఉత్పత్తి చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com