ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్‌ 100 ఫిల్స్‌ కాయిన్స్‌ స్వాధీనం

ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్‌ 100 ఫిల్స్‌ కాయిన్స్‌ స్వాధీనం

కువైట్‌: 100 ఫిల్స్‌ ఫేక్‌ కాయిన్స్‌ని కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2000 కువైటీ దినార్స్‌ వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఓ ఆసియా దేశం నుంచి కార్గో ద్వారా ఈ ఫేక్‌ కాయిన్స్‌ దేశంలోకి వచ్చినట్లు అధికారులు వివరించారు. కువైట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి అని, ఫేక్‌ కాయిన్స్‌ని గుర్తించడం కష్టంగా మారిందనీ, వీటి మొత్తం బరువు 127 కేజీలు వుందని అధికారులు తెలిపారు. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ జమాల్‌ అల్‌ జలవి, కస్టమ్స్‌ అధికారుల్ని ఈ సందర్భంగా అభినందించారు.

Back to Top