విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
- October 25, 2019
తమిళనాడు:తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందిన 'బిగిల్' (తెలుగులో విజిల్) నేడు విడుదల కాగా, సినిమాను అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించలేదంటూ, తమిళనాడులోని కృష్ణగిరిలో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. సినిమా హాల్ ను ధ్వంసం చేయడంతో పాటు సమీపంలోని దుకాణాలకు నిప్పు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.
దీంతో రెచ్చిపోయిన అభిమానులు.. పోలీసులు, మునిసిపాలిటీ వాహనాలను తగులబెట్టారు. 'బిగిల్' ప్రత్యేక షో వేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. వారిని చెదరగొట్టిన పోలీసులు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







