'ఖైదీ' సినిమా రివ్యూ

- October 25, 2019 , by Maagulf
'ఖైదీ' సినిమా రివ్యూ

కెరీర్ ప్రారంభం నుండి హీరో కార్తీ డిఫరెంట్ చిత్రాలని ఎంచుకొని మరి చేస్తున్నాడు. ఈసారి ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు 'ఖైదీ' గా వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక రోజు రాత్రి నేపథ్యంలో తెరకెక్కింది. జైలు నుండి పరారైన ఖైదీ తన కూతుర్ని కలుసుకున్నాడా లేదా అనే వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చాడు. అసలు ఈ ఖైదీ ఎవరు..? ఎందుకు జైలుకి వెళ్లాడు..? అనే విషయం తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ ఏంటంటే.. డిల్లీ బాబు (కార్తీ)కి ఒక కేసులో యావజ్జీవ ఖైదీగా శిక్షపడుతుంది. పదేళ్లు జైలులో ఉన్న తర్వాత సత్ప్రవర్తన కారణంగా డిల్లీని విడుదల చేస్తారు. గ్యాంగ్ స్టర్స్ విషయంలో పోలీసులు డిల్లీ సహాయాన్ని కోరతారు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. దీంతో డిల్లీకి గ్యాంగ్ స్టర్స్ అర్జున్ దాస్, రమణ గ్యాంగ్ లతో తలపడాల్సి వస్తుంది. మరోవైపు తన కూతుర్ని చూసేందుకు డిల్లీ తహతహలాడుతుంటాడు.

మరి డిల్లీ అనుకున్నది సాధించాడా..? అసలు పోలీసులు డిల్లీను ఎందుకు సహాయం చేయమని అడిగారు? చివరకి డిల్లీ తన కూతుర్ని కలిశాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్.. హీరోయిన్ లేకుండా సినిమా సాగిపోవడం ఈ సినిమాకి మేజర్ పాయింట్.

రొమాన్స్, కామెడీ, పాటలు లేకపోయినా ఈ సినిమా సన్నివేశాలను బోర్ కొట్టించకుండా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. ఈ విషయంలో దర్శకుడి విజన్ ను మెచ్చుకొని తీరవలిసిందే. ఎంతో ఉత్కంఠభరితమైన సీన్స్ తో సినిమాని డిజైన్ చేసారు.యాక్షన్ సీన్స్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. ఒకరాత్రి నాలుగుగంటల్లో జరిగే కథని స్క్రీన్ ప్లే రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు డైరక్టర్.

హై ఓల్టేజ్ యాక్టింగ్ తో కార్తీ సినిమాలో మెప్పిస్తాడు. చాలా గ్రిప్పింగ్ గా స్టోరీని తెరకెక్కించారు. అదే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. సామ్ సిఎస్ నేపధ్య సంగీతం ఈ సినిమా ఫీల్ ను ఎలివేట్ చేయగా సినిమా ఫోటోగ్రఫీ చాలా సూపర్ గా ఉంది.

నైట్ ఎఫెక్ట్ లో సన్నివేశాలను కెమెరా మాన్ సత్యన్ సూర్యన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అతని వాడిన లైటింగ్, ఫ్రేమింగ్ చూసి కెమెరా మాన్ కు 100 మార్కులు వేయవచ్చు. ఇక యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. మైనస్ పాయింట్స్.. మెయిన్ కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు.

దీంతో కాస్త బోరుగా ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. కొన్ని లాజిక్స్ అక్కడక్కడా మిస్ అయ్యాయి. తమిళ నేటివిటీ సన్నివేశాలు ఎక్కువ ఉండటంతో కాస్త అతిగా అనిపించవచ్చు. ఈ జోనర్ సినిమాలు చూసేవారికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవచ్చు.ఓవర్ ఆల్ గా చెప్పాలంటే..యాక్షన్ సినిమాలు చూసేవారికి ఈ ఖైదీ నచ్చుతాడు. నటీనటులు: కార్తీ, నరైన్ సంగీతం: సామ్ సిఎస్ కెమెరా: సత్యన్ సూర్యన్ దర్శకత్వం: లోకేష్ కనకరాజ్ నిర్మాతలు: డ్రీం వారియర్ పిక్చర్స్ & వివేకానంద ఫిలింస్ విడుదల తేదీ: 25/10/19 రన్ టైమ్: 147 నిమిషాలు 

మాగల్ఫ్ రేటింగ్: 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com