ఐఎస్ మారణహోమం;బాగ్దాద్
- January 11, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మారణహోమం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఐఎస్ జరిపిన బాంబు దాడుల్లో సుమారు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.బాగ్దాద్‌లోని ఓ వాణిజ్య సముదాయం ముందు ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి.. 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరికొందరు ఉగ్రవాదులు వాణిజ్య సముదాయంలో దాక్కోవడంతో భద్రతా బలగాలు భవనం పైనుంచి లోపలికి ప్రవేశించి ముష్కరులను కట్టడి చేశాయి.ఈ ప్రయత్నంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు పోలీసులకు పట్టుబట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ప్రకటించింది. తొలుత ఈ వాణిజ్య భవనంలో 50 మందిని బందీలుగా ఉంచారని పోలీసులు భావించారు.అందులోకి ప్రవేశించిన తర్వాత ఎవరూ బందీలుగా లేరని గుర్తించారు. మరో ఘటనలో ఆగ్నేయ బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే మార్కెట్లో కారు బాంబు పేల్చడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఘటనలో హోటల్‌వద్ద బాంబు దాడికి పాల్పడటంతో సుమారు 20 మంది మృతిచెందినట్లు అక్కి అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







