'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి అఫీషియల్ లుక్ విడుదల
- October 26, 2019
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు ఒక సైనికుడిగా నటిస్తున్న ఈ సినిమాను కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ అంశాలు మరియు ఎంటర్టైన్మెంట్ అంశాలు కలగలిపి, సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు అనిల్. మహేష్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా,
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే దీపావళి సందర్భంగా ఇప్పటికే తమ సినిమా నుండి రెండు సర్ప్రైజ్ లు ఇవ్వబోతున్నట్లు సరిలేరు యూనిట్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాటిచ్చిన విధంగా కాసేపటి క్రితం తమ సినిమాలో విజయశాంతి గారు పోషిస్తున్న ప్రొఫెసర్ భారతి క్యారెక్టర్ తాలూకు అఫీషియల్ లుక్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ లుక్ లో విజయశాంతి గారిని చూస్తుంటే గతంలోని ఆమె నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తున్నాయని, తప్పకుండా ఆమెకు ఈ సినిమా మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది అంటూ పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు కూడా భరత్ అనే నేను, మహర్షి వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్లతో మంచి ఫామ్ లో ఉండడంతో, తప్పకుండా ఆయన ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ విజయాలు అందుకుంటారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫొటోగ్రపీని, తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్....!!
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







