సైనికుడిగా రానా..!
- October 28, 2019
హైదరాబాద్: రానా దగ్గుబాటి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం '1945'. ఈ సినిమాకు శివకుమార్ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు శివకుమార్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'మూడేళ్ల తర్వాత నా సినిమా పూర్తయ్యింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశభక్తి, ఒక ఐఎన్‌ఏ సైనికుడి ప్రేమ.. అనే భావోద్వేగాల మధ్య జరిగిన యుద్ధమే.. '1945' అని దర్శకుడు పేర్కొన్నారు.
ఐఎన్‌ఏ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్.ఎన్.రాజరాజన్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరాలను అందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాని జనవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు రానా 'విరాటపర్వం 1942' సినిమాలో నటిస్తున్నారు. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







