నటి అర్చన పెళ్లి ముహూర్తం ఖరారు
- October 29, 2019
నటి అర్చన పెళ్లి తేదీ ఖరారయింది. నవంబర్ 13న పెళ్లి చేసుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రముఖ వ్యాపార వేత్త జగదీశ్‌ను అర్చన వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా జగదీశ్, అర్చన ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వీరి పెళ్లికి వాళ్లు అంగీకరించారు. దీంతో అక్టోబర్ 3న అర్చన, జగదీశ్ నిశ్చితార్థం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు అర్చన, జగదీశ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నటి అర్చన తాజాగా సప్తగిరి హీరోగా నటించిన 'వజ్రకవచధర గోవిందా' సినిమాలో నటించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







