'పింక్' పవన్ కల్యాణ్
- November 03, 2019
సినీనటుడు పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారని, హిందీలో విజయవంతమైన 'పింక్' రీమేక్‌లో నటించబోతున్నారని ఈనాడు వెల్లడించింది. ఆ విషయాన్ని బాలీవుడ్ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. బాలీవుడ్‌లో నిర్మితమైన 'పింక్'లో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుద్ధరాయ్ చౌధురి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ కథానాయకుడిగా బోనీ కపూర్ పునర్నిర్మించారు. ఇప్పుడు తెలుగులో దిల్‌రాజుతో కలిసి బోనీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని, యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తారని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్‌లో వెల్లడించారు.
ఆ ట్వీట్‌ని నిర్మాత బోనీ రీట్వీట్ చేయడంతో అది నిజమే అని ధ్రువీకరించినట్టైంది. హిందీ, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్ర కథ నచ్చి పవన్ అంగీకారం తెలిపారని సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!