బుర్జ్ ఖలీఫాపై షారూఖ్ పేరు..తొలి నటుడిగా రికార్డ్
- November 03, 2019


బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. షారూఖ్ బర్త్‌డే సందర్భంగా ఆయన పేరుని ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. 'కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారూఖ్ ఖాన్ హ్యాపీ బర్త్‌డే' అనే సందేశం బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షం కాగా, ఇది చూసిన ప్రతి ఒక్క అభిమాని ఎంతగానో పులకరించిపోయారు. బుర్జ్ ఖలీఫాపై ఓ నటుడి పేరు ప్రదర్శించడం ఇదే తొలిసారి కాగా, ఈ విషయం విన్న షారూఖ్ కూడా తెగ సంతోషించాడు. తన ట్విట్టర్‌లో వీడియోని షేర్ చేస్తూ..తన బర్త్‌డేకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిన నిర్వాహకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బర్త్‌డే ముందు రోజు రాత్రి షారూఖ్ ఇంటి దగ్గర అభిమానులు ఆయనకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. వారందరికి చీర్స్ చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు షారూఖ్.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







